Advertisement

Responsive Advertisement

వృషభ రాశి - రోహిణి నక్షత్రం

 


వృషభ రాశి - రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు 

  1. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. 6వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది.
  2. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్ర గ్రహం. 2వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తాడు. 

 

2, 6 సంఖ్యలు ఒకరికొకరు ఒకరికొకరు తటస్థ సంఖ్యలు

  1. 2వ సంఖ్యకు చెందిన 2,11, 20, 29 తేదీలు అదృష్ట తేదీలు అవుతాయి. అలాగే 6వ సంఖ్యకు చెందిన 6,15,24 తేదీలు అదృష్ట తేదీలు అవుతాయి.
  2. 2వ సంఖ్యా - సోమవారం
  3. 6వ సంఖ్యా - శుక్రవారం
  4. కావున పైన ఇవ్వబడిన అదృష్ట తేదీలలో సోమా, శుక్రవారాలు వస్తే ఇంకా మంచిది.

ప్రస్తుతం జరుగుతున్న మహాదశ 

  1. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు - 1 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
  2. కుజ మహాదశ 7 సంవత్సరాలు – 7 సంవత్సరాలు నుండి  17 సంవత్సరాల 17 సంవత్సరాల వరకు కుజ మహాదశ ఉంటుంది.
  3. రాహు మహాదశ 18 సంవత్సరాలు  - 17 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు రాహు మహాదశ ఉంటుంది.
  4. గురు మహాదశ 16 సంవత్సరాలు - 35 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల వరకు గురు మహాదశ ఉంటుంది.
  5. శని  మహాదశ 19 సంవత్సరాలు - 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు శని మహాదశ ఉంటుంది.

నవగ్రహ స్తోత్రం / శ్లోకం 

  1. ప్రస్తుతం జరుగుతున్న మహాదశ ఏ గ్రహానికి చెందినదైతే ఆ గ్రహానికి చెందిన నవగ్రహ స్తోత్రాన్ని జపించాలి. 
  2. సోమ, శుక్ర వారాలలో తప్పనిసరిగా అమ్మవారి గుడికి వెళ్ళాలి.
  3. చంద్ర, శుక్ర గ్రహాలు తెలుపు రంగుకు కారకత్వం వహిస్తాయి. కావున తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచింది. 
  4. ఈ రాశివారికి తెలుపు అదృష్ట రంగు అవుతుంది.
  5. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి సహజంగా మానసిక సమస్యలు కూడా ఉంటాయి. 
  6. చంద్ర గ్రహానికి చెందిన నవగ్రహ స్తోత్రాన్ని జపించాలి. అలాగే ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి.  
  7. ప్రతిరోజూ చేయటం వలన మనస్సు ఏదో తెలియని ఒక అనుభూతికి లోనవుతుంది. అప్పుడు మనలో దాగివున్న ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది. 
  8. అంటే మన శరీరం పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకుంటుందని అర్థం. 

రోహిణి నక్షత్రం - 4 పాదాలు 

  1. రోహిణి నక్షత్రానికి చెందిన చంద్ర గ్రహం యొక్క మహాదశ కాలం 10  సంవత్సరాలు. ఒక పాదం 2 సంవత్సరాల నెలలు.  
  2. మీరు ఏ పాదంలో జన్మిస్తే ఆ పాదం యొక్క 2 సంవత్సరాల నెలలు తగ్గించుకోవాలి. 
  3. ఉదాహరణకు రోహిణి నక్షత్రం 3వ పాదంలో జన్మిస్తే - ప్రస్తుతం జరుగుతున్న మహాదశలోనుండి 5 సంవత్సరాలు  తగ్గించుకోవాలి. 



Post a Comment

0 Comments