Advertisement

Responsive Advertisement

ఓం - ఓంకారం

"ఓం" అనే నాదం ఆధ్యాత్మిక సంస్కృత ధ్వని. 


వేదాలలో నిక్షిప్తమై ఉన్నా "ఓం" ఒక అక్షరం. సమస్త విశ్వానికంత ఓంకార నాదం ప్రథమ నాదం. పంచ భూతాలలో ఓంకార శబ్దం ప్రథమమైనదని వేద పండితులు వర్ణించారు. 

"ఓం" అంటూ ఉచ్చరించగానే లేదా శబ్దం వినగానే ఏదో తెలియని అనుభూతికి మనస్సు పరవశిస్తుంది. ఇది ఎవరు కాదనలేని అక్షర సత్యం. 

"ఓం" అనే అక్షరానికి ఏదో ప్రతేకత ఉందని, మానసిక ఉల్లాసం వస్తుందని ప్రపంచ విశ్వవిద్యాలయాలలో జరిపిన పరిశోధనలో రుజువైన నిజం. 

అందుకే "ఓం" అనే నాదం ఆధ్యాత్మిక సంస్కృత అక్షరమైనప్పటికీ సమస్త విశ్వానికంత ఓంకార నాదం ప్రథమ నాదమని చెప్పబడుతుంది. 

నిత్యం ప్రతిరోజు క్రమం తప్పకుండా "ఓం" అంటూ ఉచ్చరిస్తూ ధ్యానం చేయడం వలన మనలో దాగి ఉన్నా ప్రతికూలమైన ఆలచనలు ( Negative Thoughts )రాకుండా చేస్తుంది. 

"ఓం" అంటూ ఉచ్చరిస్తున్న సమయంలో రక్త ప్రసరణ ప్రక్రియ ద్వారా  ఆక్సిజన్ గుండెకు చేరుతుంది. తద్వారా మన మనస్సు సానుకూల దృక్పథంతో ( Positive Thoughts ) ఆలోచిస్తుంది. మన మెదడు యొక్క పనితీరు సరిగ్గా పని చేస్తుంది. ఇది అక్షర సత్యమని పరిశోధనలో రుజువైన నిజం. 

 "ఓం" అనే శబ్దం ఉచ్చరిస్తున్నప్పుడు నాభి నుంచి మొదలై మెదడులో ప్రతిద్వనించాలి. సమస్త రోగాలకు చెక్ పెట్టవచ్చు. 

కావున ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఓంకార నాదంతో ధ్యానం చేయాలి. 

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.  

లోక సమస్త సుఖినోభవంతు !

Post a Comment

0 Comments