మేషరాశి - కృత్తిక నక్షత్రం - 1వ పాదంలో జన్మించిన వారు
- మేషరాశికి అధిపతి కుజ గ్రహం. 9వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది.
- కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్య గ్రహం. 1వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది.
1,9 సంఖ్యలు ఒకరికొకరు మిత్ర సంఖ్యలు.
- కావున 1వ సంఖ్యకు చెందిన 1, 10.19,28 తేదీలు మరియు 5వ సంఖ్యకు చెందిన 5,14, 23 తేదీలు అదృష్ట తేదీలు అవుతాయి.
- 1వ సంఖ్య ఆదివారానికి ఆధిపత్యం వహిస్తుంది. అలాగే 9వ సంఖ్య మంగళవారానికి ఆధిపత్యం వహిస్తుంది.
- కావున పైన ఇవ్వబడిన అదృష్ట తేదీలలో ఆదివారం, మంగళవారం వస్తే ఖచ్చితంగా ఈ రోజులో మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రస్తుతం జరుగుతున్న మహాదశ
- సూర్య మహాదశ 6 సంవత్సరాలు - 1 నుండి 6 సంవత్సరాల వరకు సూర్య మహాదశ ఉంటుంది. మేషరాశిలో కృత్తిక 1వ పాదం కావున 1 సంవత్సరం 6 నెలలు ఉంటుంది.
- చంద్ర మహాదశ 10 సంవత్సరాలు - 10 సంవత్సరం 6 నెలల నుండి 11 సంవత్సరాల 6 నెలల వరకు చంద్ర మహాదశ ఉంటుంది.
- కుజ మహాదశ 7 సంవత్సరాలు - 11 సంవత్సరాల 6 నెలల నుండి 17 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహాదశ ఉంటుంది.
- రాహు మహాదశ 18 సంవత్సరాలు - 17 సంవత్సరాల 6 నెలల నుండి 35 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహాదశ ఉంటుంది.
- గురు మహాదశ 16 సంవత్సరాలు - 35 సంవత్సరాల 6 నెలల నుండి 51 సంవత్సరాల 6 నెలల వరకు గురు మహాదశ ఉంటుంది.
నవగ్రహ స్తోత్రం / శ్లోకం
- ప్రస్తుతం జరుగుతున్న మహాదశ ఏ గ్రహానికి చెందినదైతే ఆ గ్రహానికి చెందిన నవగ్రహ స్తోత్రాన్ని జపించాలి.
- అదృష్ట వారాలు ఆదివారం రోజున శివాలయానికి, అలాగే మంగళవారం రోజున తప్పనిసరిగా విగ్నేశ్వరుని గుడికి వెళ్లి, దర్శనం చేసుకున్న తరువాత ధ్యాన ముద్రలో ప్రశాంతంగా 15 నిముషాలు గడపండి.
- కుజ గ్రహం - ఎరుపు రంగు. సూర్య గ్రహం ఆరంజ్ కలర్. అది, మంగళవారాలలో లైట్ ఆరంజ్ కలర్ దుస్తులు ధరించి గుడికి వెళ్ళండి
- అలాగే అదృష్ట తేదీలలో మీకు దగ్గరిలో ఉన్న ఆ రోజు ఏ వారమైతే ఆ రోజుకు ఆధిపత్యం వహించే గుడికి వెళ్ళండి.
- అలాగే అదృష్ట తేదీలు మరియు అదృష్ట వారాలలో మీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేయండి. పేద విద్యార్థులకు సహాయం చేస్తే ఇంకా మంచిది.
- ఆదిత్య హృదయం వినండి లేదా జపించండి.
0 Comments