Advertisement

Responsive Advertisement

మేషరాశి - అశ్విని నక్షత్రం


మేషరాశి - అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు 

  • మేషరాశికి అధిపతి కుజ గ్రహం. 9వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది. 
  • అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు గ్రహం. 7వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది. 


7,9 సంఖ్యలు ఒకరికొకరు మిత్ర సంఖ్యలు. 

  • కావున 7వ సంఖ్యకు చెందిన 7,16, 25 తేదీలు మరియు 9వ సంఖ్యకు చెందిన 9, 18, 27 తేదీలు అదృష్ట తేదీలు అవుతాయి.  


ప్రస్తుతం జరుగుతున్న మహాదశ 

  • కేతు మహాదశ 7 సంవత్సరాలు - 1 నుండి 7 సంవత్సరాల వరకు కేతు మహాదశ ఉంటుంది.
  • శుక్ర మహాదశ 20 సంవత్సరాలు - 7 నుండి 27 సంవత్సరాల వరకు శుక్ర
    మహాదశ ఉంటుంది.
  • సూర్య మహాదశ 6 సంవత్సరాలు - 27 నుండి 33 సంవత్సరాల వరకు సూర్య మహాదశ ఉంటుంది.
  • చంద్ర మహాదశ 10 సంవత్సరాలు - 33 నుండి 43 సంవత్సరాల వరకు చంద్ర మహాదశ ఉంటుంది.
  • కుజ మహాదశ 7 సంవత్సరాలు - 43 నుండి 50 సంవత్సరాల వరకు చంద్ర మహాదశ ఉంటుంది
  • రాహు మహాదశ 18 సంవత్సరాలు - 50 నుండి 68 సంవత్సరాల వరకు సూర్య మహాదశ ఉంటుంది.
  • గురు మహాదశ 16 సంవత్సరాలు - 68 నుండి 84 సంవత్సరాల వరకు గురు మహాదశ ఉంటుంది.


నవగ్రహ స్తోత్రం / శ్లోకం 

  • ప్రస్తుతం జరుగుతున్న మహాదశ ఏ గ్రహానికి చెందినదైతే ఆ గ్రహానికి చెందిన నవగ్రహ స్తోత్రాన్ని జపిస్తూ - పైన ఇవ్వబడిన అదృష్ట తేదీలలో మీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేసిన లేదా అన్నదానం చేసిన మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. 


అశ్విని నక్షత్రం - 4 పాదాలు 

  • అశ్విని నక్షత్రానికి చెందిన కేతు గ్రహానికి 7 సంవత్సరాలు. ఒక పాదం 1.75 సంవత్సరాలు. అనగా 21 నెలలు.  
  • మీరు ఏ పాదంలో జన్మిస్తే ఆ పాదం యొక్క నేలలను తగ్గించుకోవాలి. 
  • ఉదాహరణకు అశ్విని నక్షత్రం 3వ పాదంలో జన్మిస్తే - ప్రస్తుతం జరుగుతున్న మహాదశలోనుండి 42 నెలలు తగ్గించుకోవాలి. 

Post a Comment

0 Comments