శ్రీ నరసింహ స్వామి క్షేత్రం
చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో - 400 మీటర్ల దూరంలో నడుము లోతు వరకు నీరు ఉండే కొండ గుహలో నరసింహ స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం.
కొండా గుహలో స్వయంభూగా వెలసిన శ్రీ నరసింహ స్వామి పాదాల దగ్గర నుండి నీరు ప్రవహిస్తుండడంతో శ్రీ నరసింహ స్వామి ఝార్ణ గుహ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఝార్ణ నరసింహస్వామి క్షేత్రమని కూడా పిలుస్తుంటారు.
ఈ క్షేత్రంలో దర్శనం అన్ని ఆలయాలకంటే బిన్నంగా ఉంటుంది. నడుము లోతు వరకు ఉండే నీటిలో నడుచుకుంటూ 400 మీటర్ల దూరంలో స్వయంభూగా గర్భ గుడిలో కొలువైన ఝార్ణ నరసింహస్వామిని దర్శించుకోవాలి.
ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు దగ్గరిగా ఉంటుంది.
హైదరాబాద్ నుండి బీదర్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీదర్ బస్సు స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
చుట్టూ కొండలు, పచ్చని వాతావరణములో కొండా గుహలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ నరసింహ స్వామి క్షేత్ర ఆధ్యాత్మిక యాత్ర చక్కటి మరుపురాని అనుభూతుని ఇస్తుంది.
0 Comments